Consultation Locations

✅ NALLAGANDLA BRANCH : Plot No:12H, Ground floor, HUDA COMPLEX
Near D Mart, Kanchi Gachibowli Road, Nallagandla, Hyderabad, Telangana - 500019
Timing : Morning : Mon - Sat: 8.00 AM - 10.30 AM
                  Evening : Mon, Wed, Fri - 5.30pm - 9pm

✅ CHANDA NAGAR BRANCH : 202, 3ʳᵈ floor, Ashish MySpace,
Above khazana Jewellery, Chandanagar, Hyderabad, Telangana - 500050
Timing :   Available 3 Days in a week
                   Evening : Tues, Thurs, Sat - 5.30pm - 9pm

కోవిడ్ -19 వాక్సిన్ గురించి తరచుగా అడిగే 23 ప్రశ్నలు!

Posted on: 13 May 2021

By: Dr Vinoth Kumar

Published in:

Read time:

కోవిడ్ -19 అనే వ్యాధి 2019 లో మొదలయ్యి, ఇప్పటికి ప్రపంచంలో ఎన్నో లక్షల మంది ప్రాణాలు తీసింది. దీన్ని అరికట్టడానికి ప్రస్తుతం మనకు ఉన్న ఏకైక మార్గం వాక్సినేషన్. ఈ పేజీ లో కోవిడ్-19 వాక్సిన్ గురించి, వాక్సిన్ భద్రత గురించి అలాగే వాక్సిన్ ను ఎవరు తీసుకోవచ్చు, ఎవరు తీసుకోకూడదు వంటి ప్రశ్నలకు తగిన సమాధానాల్ని పొందుపరిచాము.

1.ఇండియా లో Covid-19 కి సంబందించిన ఎన్ని వాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి?

— ఏప్రిల్ నాటికి ఇండియా లో రెండు రకాల కోవిడ్ -19 వాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి- Covishield, Covaxin. అయితే మే నెలలో రష్యా నుండి Sputnik V అనబడే ఒక కొత్త వాక్సిన్ మన భారత ప్రభుత్వంచే ఆమోదింపబడి, అందరికి అందుబాటులోకి రానుంది.

2. ఈ వాక్సిన్ ను ఎవరెవరు తీసుకోవచ్చు?

— 18 సంవత్సరాలు పైబడిన వారందరు ఈ వాక్సిన్ ను తీసుకోవచ్చు.

3. ఈ వాక్సిన్ ను ఎవరు తీసుకోకూడదు?

— ఎవరైతే ఈ వాక్సిన్ యొక్క మొదటి డోస్ తీసుకుని, తీవ్రమైన అలర్జీ కి గురి అవుతారో.. అలాగే ఎవరికైతే ఈ వాక్సిన్ యొక్క ముడిపధార్దాలకు అలర్జీ కలిగి ఉంటారో, వారు ఈ వాక్సిన్ ను తీసుకోకూడదు.

4. చిన్నపిల్లలకు ఈ వాక్సిన్ టీకాలు వేయించవచ్చా?

— లేదు. ప్రస్తుతానికి 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు గల పిల్లలపై ఈ వాక్సిన్ అధ్యాయనాలు ఇంకా పూర్తి కాలేదు, కాబట్టి ప్రస్తుతానికి వాక్సిన్ ను ఇవ్వలేము. కానీ అధ్యాయనాలు పూర్తి అయిన తర్వాత ఈ సిఫార్సులు మారవచ్చు.

5. గర్భిణులు మరియు పాలిచ్చే తల్లులు వాక్సినేషన్ పొందావచ్చా?

— లేదు. MoHFW సిఫార్సు ప్రకారం, గర్భిణులు మరియు పాలిచ్చే తల్లులు వాక్సినేషన్ తీసుకోకూడదు. అయితే వారి మీద కూడా అధ్యాయనాలు పూర్తి ఐన తర్వాత ఈ సిఫార్సులు కూడా మారవచ్చు.

6. నాకు మధుమేహం, హై బీపీ, కాన్సర్, హార్ట్ ఫెయిల్యూర్, కిడ్నీ, లివర్, ఉపిరితిత్తులకి సంబంధించిన దీర్ఘాకాలిక వ్యాధులు వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే.. నేను వాక్సిన్ తీసుకోవచ్చా?

— తీసుకోవచ్చు. నిజానికి ఇటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి తీవ్రమైన Covid వ్యాధి సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, వీరు వాక్సినేషన్ తీసుకోవడం చాలా ముఖ్యం.

7. వాక్సినేషన్ సమయం లో నేను నా రోజువారి మాత్రలను తీసుకోవడం ఆపివేయాలా?

— అవసరం లేదు. మధుమేహం, బీపీ, మరియు గుండె సంబంధిత సమస్యలకు వాడే మాత్రలను మరియు రక్తం గడ్డ కట్టకుండా వాడే ఆస్ప్రిన్ తో సహా ఔషధాలను వాక్సినేషన్ తీసుకుంటున్నపుడు, తీసుకున్న తర్వాత కూడా కొనసాగించవచ్చు. ఏమైనా ప్రత్యేక మందులు వాడుతున్నట్లయితే, మీ వైద్యున్ని సంప్రదించిన తర్వాత తీసుకోవడం మంచిది.

8. హెపారిన్, వార్ఫారిన్ వంటి ప్రతిస్కందక ఔషాదాలను తీసుకునే క్రమం లో నేను ఈ వాక్సినేషన్ తీసుకోవచ్చా?

— తీసుకోవచ్చు. అయితే వాక్సిన్ తీసుకునే ముందు మీరు మీ INR(international normalised ratio) ను పరీక్షించుకోవలసి ఉంటుంది. మీ INR 4 కంటే తక్కువ ఉంటే, మీరు సురక్షితం గా వాక్సిన్ పొందవచ్చు. వాక్సిన్ టీకా వేసిన తర్వాత ఆ ప్రాంతం లో కనీసం 5 నిమిషాల పాటు ఒత్తిడి కలిగించాలి. టీకా వేసిన చోట ఏదైన వాపు గమనించినట్లయితే, వెంటనే మీ డాక్టర్ ను సంప్రదించి, దాన్ని తొలగించాలి.

9. రోగానిరోధకత లేని నేను వాక్సిన్ తీసుకోవడం సురక్షితమేనా?

— అవును. మీరు స్టెరాయిడ్స్ వాడుతున్నప్పటికి ఈ వాక్సిన్ పూర్తిగా సురక్షితం. అయితే ఇతరులతో పోల్చినపుడు మీ మీద వాక్సిన్ యొక్క ప్రభావం కొద్దిగా తగ్గవచ్చు.

10. నాకు ఇప్పటికే కోవిడ్ సోకినట్లయితే నేను వాక్సిన్ తీసుకోవచ్చా?

— తీసుకోవచ్చు. మన శరీరం ఇచ్చే సహజసిద్ధమైన రక్షణ కాలం ఎంతో స్పష్టంగా తెలియదు కాబట్టి వాక్సినేషన్ పొందడం చాలా ముఖ్యం.

11. కోవిడ్ వచ్చిన తర్వాత వాక్సినేషన్ పొందాటానికి ఎంత సమయం తీసుకోవాలి?

— కోవిడ్ నుండి పూర్తిగా కోలుకున్న 4-8 వారాల తర్వాత వాక్సిన్ పొందవచ్చు.

12. నా మొదటి డోస్ తీసుకున్న తర్వాత Covid సోకినట్లయితే ఏం చేయాలి, అటువంటపుడు రెండవ డోస్ తీసుకోవచ్చా?

— తీసుకోవచ్చు. కానీ Covid నుండి పూర్తిగా కోలుకున్న 4-8 వారాల తర్వాత వాక్సిన్ పొందవచ్చు. అటువంటి సందర్భంలో మళ్ళీ మొదటి డోస్ తీసుకోనవసరం లేదు.

13. వాక్సినేషన్ తర్వాత మద్యపానం సురక్షితమేనా?

— అవును. మద్యపానానికి వాక్సినేషన్ తో ఎటువంటి సంబంధం లేదు. కానీ మద్యం నివారించడం మంచిది.

14. ఆడవారు తమ రుతుక్రమం లో వాక్సినేషన్ పొందావచ్చా?

— అవును. అది కచ్చితంగా సురక్షితమే.

15. వాక్సినేషన్ వల్ల ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉందా?

— లేదు. మనకు అందుబాటులో ఉన్న కోవిడ్ వాక్సిన్లేవీ ప్రత్యక్ష వాక్సిన్లు కావు. కాబట్టి వాక్సినేషన్ వల్ల ఇన్ఫెక్షన్ సోకే అవకాశం లేనే లేదు.

16. వాక్సిన్ తీసుకున్న తర్వాత ఎంత సమయం లోపు నేను పూర్తి రక్షణ పొందగలను?

— అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, వాక్సిన్ పూర్తి కోర్సు తీసుకున్న 2 వారాల తర్వాత అది మనకు తగిన సంరక్షణ ఇవ్వగలదు.

17. వాక్సిన్ తీసుకున్న తర్వాత నాకు ఎట్టి పరిస్థితుల్లో వ్యాధి సోకకుండా ఉంటుందా?

— లేదు. ప్రస్తుతం ఉన్న వాక్సిన్లు ప్రభావవంతమైనవి అయినప్పటికీ అవి మనకు వ్యాధి నుండి 100 % సంరక్షణ ఇవ్వలేవు. ప్రస్తుత సమాచారం ప్రకారం, 2 డోస్ లు పూర్తి అయిన తర్వాత వ్యాధి సోకే అవకాశం కోవిషిల్డ్ వాక్సిన్ కి 0.03%, కోవాక్సిన్ కి 0.04 % ఉంది.

18. ఈ వాక్సిన్ తో పాటు ఇతర వాక్సిన్లు తీసుకోవడం సురక్షితమేనా?

— ఇతర వాక్సిన్లతో కలిపి తీసుకోవడం సిఫారసు చేయతగినది కాదు. కోవిడ్ వాక్సిన్ కి, ఇతర వాక్సిన్లకు కనీసం రెండు వారాల సమయం అంతరం మంచిది. అయితే రాబిస్ వాక్సిన్( కుక్క కాటు) వంటి అత్యవసర పరిస్థితుల్లో మాత్రం, రెండు వాక్సిన్లు కలిపి తీసుకోవచ్చు.

19. ఈ వాక్సిన్ల యొక్కప్రభావం ఎంత కాలం ఉంటుంది? మళ్ళీ ఇంకో డోస్ అవసరం పడుతుందా?

— తెలీదు. దీనికి సంబందించిన సమాచారం ఇంకా లేదు.

20. భిన్నమైన వాక్సిన్ నుండి రెండవ డోస్ ను తీసుకోవచ్చా?

— లేదు. ఇటువంటి సిఫారసులకు సంబంధించిన అధ్యాయనాలు ఇంకా జరగలేదు.

21. ఇతర సాధారణ వాక్సిన్ లు కోవిడ్ -19 నుండి రక్షించగలవా?

— లేదు. BCG, MMR వంటి వాక్సిన్ల పై అధ్యాయనాలు జరుగుతున్నప్పటికి, అవి కోవిడ్ నుండి తగినంత సురక్షితం కావు.

22. నేను ఇప్పటికే కోవిడ్ -19 వాక్సిన్, రెండు డోస్ లు తీసుకున్నాను. నేను ఇంకా మాస్క్ ను ధరించాలా?

— అవును. వాక్సిన్ తీసుకున్నప్పటికి, మాస్క్ ను ధరించడం, సామాజిక దూరం పాటించడం, చేతులు పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యం.

23. ఈ వాక్సిన్లు సురక్షితమైనవేనా? వాక్సినేషన్ వల్ల రక్తం గడ్డ కడుతుందా?

— పెద్ద ఎత్తున జరిపిన అధ్యయనాల్లో ఈ వాక్సిన్లు చాలా సురక్షితమైనవి గా నిరూపించబడ్డాయి. రక్తం గడ్డ కట్టడంlలో ఉన్న ప్రమాదం ఇంచుమించు అందరిలోనూ ఒకేలా ఉంది. నిజానికి ఇలా రక్తం గడ్డ కట్టే ప్రమాదం కోవిడ్ సోకితేనే ఎక్కువగా ఉంటుంది.