Consultation Locations

✅ NALLAGANDLA BRANCH : Plot No:12H, Ground floor, HUDA COMPLEX
Near D Mart, Kanchi Gachibowli Road, Nallagandla, Hyderabad, Telangana - 500019
Timing : Morning : Mon - Sat: 8.00 AM - 10.30 AM
                  Evening : Mon, Wed, Fri - 5.30pm - 9pm

✅ CHANDA NAGAR BRANCH : 202, 3ʳᵈ floor, Ashish MySpace,
Above khazana Jewellery, Chandanagar, Hyderabad, Telangana - 500050
Timing :   Available 3 Days in a week
                   Evening : Tues, Thurs, Sat - 5.30pm - 9pm

కోవిడ్ -19 నుండి కోలుకున్న తర్వాత తీసుకోవలసిన ఆహరం : ఏమి తినాలి, ఏమి తినకూడదు?

Posted on: 27 May 2021

By: Dr Vinoth Kumar

Published in:

Read time:

ఆరోగ్యమైన, పోషకాహారం తీసుకోవడం అనేది ఏ వ్యాధి నుండి కోలుకునేటప్పుడు అయినా చాలా ముఖ్యమైన విషయం. కోవిడ్ 19 వంటి భయంకరమైన వ్యాధి విషయం లో ఇంకా ముఖ్యం. త్వరగా కోలుకోవడానికి మరియు రోగ నిరోధక శక్తి ని పెంచడానికి ఈ క్రింద కొన్ని సూచనలు ఇవ్వబడ్డాయి.

1. తాజా ఆహరం తీసుకోండి :

ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం, ప్రోటీన్స్, విటమిన్లు మరియు మినరల్స్ కలిగిన తాజా ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తుంది. పండ్లు, కూరగాయలు, చిక్కుళ్ళు, ధాన్యాలు వంటివి మన ఆహారం లో చేర్చుకోవాలి. ప్రతి రోజు 2 కప్పుల పండ్లు, 2.5 కప్పుల కాయగూరలు తినడం మంచిది.
వారానికి రెండు సార్లు మాంసం మరియు గుడ్లు తీసుకోవాలి. కూరగాయల్ని మరీ ఎక్కువగా వండకూడదు. దీని వల్ల వాటి పోషక విలువలు పోయే ప్రమాదం ఉంది.

2. తగినంత నీళ్లు తాగాలి:

శరీరం లోని ఎటువంటి జీవక్రియకైనా, నీరు చాలా ముఖ్యం. కాబట్టి, రోజు కనీసం 8 నుండి 10 గ్లాసుల నీటిని తాగాలి. నీటి శాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయలు, నారింజ, ఆపిల్ వంటి పళ్ళు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, కూడా తీసుకోవాలి.

3. నూనె, కొవ్వు పదార్ధాలు మితంగా తీసుకోవాలి :

అసంతృప్త కొవ్వు పదార్ధాలైన మాంసం,వెన్న,కొబ్బరినూనె, నెయ్యి కి బదులుగా చేపలు, అవకాడో, ఆలివ్, సొయా నూనెలను తీసుకోవడం మంచిది. మేక మాంసం కంటే చికెన్, చేపలు ఉత్తమం.
వేపుళ్ళు, ఫాస్ట్ ఫుడ్ వంటివి తినకపోవడమే మంచిది.

4. ఉప్పు, పంచదార వంటివి మితంగా తీసుకోవాలి

రోజుకి 5 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తీసుకోరాదు. శీతల పానీయాలు, సోడాలు తాగడం తగ్గించాలి.

5. వ్యాధి నిరోధక శక్తిని పెంచే విటమిన్లు మినరల్స్ కలిగిన ఆహారాన్ని తీసుకోండి

ఈ క్రింద చెప్పబడిన వ్యాధి నిరోధక శక్తిని పెంచే విటమిన్లు మినరల్స్ కలిగిన ఆహారాన్ని సప్లిమెంట్ల రూపంలో గాని, నేరుగా గాని తీసుకోండి.

విటమిన్ -డి : చేపలు, మాంసం, గుడ్డు పచ్చసొన, పాలు, పాల పదార్ధాలు మరియు పుట్టగొడుగులు.
విటమిన్ – ఎ : గుడ్లు, చేపలు, పాలు, లివర్, చిలకడ దుంపలు, క్యారట్లు, పాలకూర మరియు గుమ్మడి కాయలు.
విటమిన్ – ఇ : చేపలు, బాదం, వేరుశెనగ, గుమ్మడి గింజలు మరియు సన్ ఫ్లవర్ ఆయిల్.
విటమిన్ – సి : పుల్లని పండ్లు, బ్రోకలి, స్ట్రాబెర్రీ, టమాటో మరియు పాలకూర.
ఫోలేట్ : అన్ని రకాల ఆకుకూరలు
జింక్ : చికెన్, పీతలు, బాదం, జీడిపప్పు, గుమ్మడి గింజలు
సెలీనియం : సీ ఫుడ్, మాంసం, లివర్ మరియు వెన్న.

6. జీవన విధాన ప్రణాళికలు

పైన చెప్పిన ఆహార నియమాలతో పాటు కొన్ని జీవన విధాన మార్పులతో మీ రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు.

1. తగినంత నిద్ర
2. ఒత్తిడి లేకుండా ఉండటం
3. దూమపానం మానివేయడం
4. మద్యపాన అలవాటు ఉంటే మితం గా ఉండటం
5. కోలుకున్న 2 నుండి 4 వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవడం
6. మెల్లగా రోజువారీ వ్యాయామం ప్రారంభించాలి.