Consultation Locations
✅ NALLAGANDLA BRANCH : Plot No:12H, Ground floor, HUDA COMPLEX
Near D Mart, Kanchi Gachibowli Road, Nallagandla, Hyderabad, Telangana - 500019
Timing : Morning : Mon - Sat: 8.00 AM - 10.30 AM
Evening : Mon, Wed, Fri - 5.30pm - 9pm
✅ CHANDA NAGAR BRANCH : 202, 3ʳᵈ floor, Ashish MySpace,
Above khazana Jewellery, Chandanagar, Hyderabad, Telangana - 500050
Timing : Available 3 Days in a week
Evening : Tues, Thurs, Sat - 5.30pm - 9pm
పురుషులతో పోల్చుకుంటే మహిళల్లో గుండె సమస్యలు తక్కువ. అయినప్పటికీ ప్రపంచంలోని స్త్రీల మరణాలకు గల కారణాల్లో గుండె సమస్యలు అనేవి ముఖ్యమైనవి.
స్త్రీలలో గుండె జబ్బులు రావడానికి గల కారణాలు ఏంటి? వాటిని ఎలా గుర్తించవచ్చు?
సాధారణంగా మహిళల్లో “మెనోపాజ్” దశ వరకు హార్ట్ ఎటాక్స్ రావడం చాలా అరుదు. కానీ వారిలో మధుమేహం, థైరాయిడ్ వంటి సమస్యలున్నా, లేదా వారి కుటుంబంలో ఎవరైనా చిన్న వయసులోనే హార్ట్ ఎటాక్ కు గురి అయినా అపుడు వారు కూడా ఈ సమస్యను ఎదుర్కొనవలసి రావొచ్చు. అయితే మహిళ్లలో వీటి గురించిన అవగాహన తక్కువ.
చాలామంది స్త్రీలు బి.పి, షుగర్ మరియు కోలెస్ట్రాల్ నియంత్రణ లో విఫలం అవుతుంటారు. పురుషులతో పోలిస్తే మధుమేహం ఉన్న మహిళల్లో హార్ట్ ఎటాక్ రావడానికి అవకాశం ఎక్కువ. కాబట్టి మధుమేహంతో ఉన్న ఆడవాళ్లు సరైన సమయానికి మందులు తీసుకుంటూ, వారి జీవన విధానాల్లో కూడా మార్పులు చేసుకుంటూ, షుగర్ బి.పి లను అదుపులో ఉంచుకోవడం ద్వారా హృదయ సంబంధిత వ్యాధులు రాకుండా నియంత్రించుకోవచ్చు.
మహిళల్లో హార్ట్ ఎటాక్స్ వచ్చే లక్షణాలు ఏంటి ?
1) ఛాతి నొప్పి :
హార్ట్ ఎటాక్స్ లో ఛాతి నొప్పి చాలా సాధారణ లక్షణం. అయితే మహిళల్లో ఇది చాలా తక్కువ మోతాదులో వస్తుంది. అంటే, కొంతమందిలో ఇది నొప్పిలా కాకుండా బిగుతుగా, గుండె బరువెక్కినట్టు, గుండెలో మంటలా అన్పిస్తుంది. కొంతమంది మనలో భరించలేనంత నొప్పి వచ్చినపుడే హార్ట్ ఎటాక్ వస్తుంది అనుకుంటారు కానీ అది నిజం కాదు. ఎక్కువ సందర్భాల్లో ఇది చాలా తేలికపాటి గుండె నొప్పిగా వస్తుంది.
2) హార్ట్ ఎటాక్ లో ఇతర రకాలు :
•దవడ లేదా గొంతు నొప్పి
•అజీర్తి
•అలసట
•నడుస్తున్నపుడు లేదా విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఊపిరి సమస్యలు తలెత్తడం వంటివి.
ఈ లక్షణాలు అనేవి ఎక్కువగా పట్టించుకోలేనంత చిన్నవిగా ఉంటాయి.
మహిళల్లో ఛాతి నొప్పికి మరో కారణం ఏంటంటే, పెద్ద ధమనుల్లో కన్నా చిన్న ధమనుల్లో ఎక్కువగా అడ్డు పడటం. అలాంటపుడు కేవలం మందులు సరిపోతాయి. చిన్న రక్తనాళాలకి స్టంట్స్ లేదా శస్త్రచికిత్సలు చేయలేము.
తీవ్రమైన గుండెనొప్పి వచ్చిన తర్వాత కూడా మహిళలు హాస్పిటల్లో చేరడానికి ఆలస్యం చేసేందుకు గల కారణాలేంటి?
• స్త్రీలు సాధారణంగా తమ ఆరోగ్య సమస్యల్ని పట్టించుకోరు.
•ఇతర కుటుంబ సభ్యులకు ఇబ్బంది కలుగుతుందేమో అనుకుంటారు.
•కుటుంబ సభ్యులు కూడా సరిగా పట్టించుకోకపోవడం.
•దగ్గర్లోని హాస్పిటల్ కు గల దూరం
•రద్దిగా ఉండే ట్రాఫిక్ వల్ల ఆలస్యం కావడం
హార్ట్ ఎటాక్ వచ్చిన 12 గంటలలోపు పేషెంట్ హాస్పిటల్ కి రాగలిగినపుడే ట్రీట్మెంట్ యొక్క పూర్తి ప్రయోజనం కలుగుతుంది. ఆలస్యం అయ్యేకొద్ది నష్టం ఎక్కువ అవుతుంది. 12 గంటలు దాటిన తర్వాత 90 శాతం గుండె శాశ్వతంగా పాడవుతుంది.
మహిళల్లో గుండెనొప్పికి ప్రమాద కారకాలు:
మగవారిలో లేని కొన్ని నిర్ధిష్ట కారకాలు మహిళల్లో ఉంటాయి.
సాధారణ ప్రమాద కారకాలు:- డయాబెటిస్, హై బి.పి, హై కోలెస్ట్రాల్, జీవన విధానాల్లో మార్పులు, శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడి.
అసాధారణ ప్రమాద కారకాలు:- ఎండోమెట్రియోసిస్, పీసీఓడి, ప్రెగ్నన్సీ సమయంలో వచ్చే డయాబెటిస్ మరియు హై బి.పి.. ప్రెగ్నెన్సీ సమయంలో గుండెలోని రక్తనాళాల చీలిక వల్ల చాలా అరుదుగా హార్ట్ ఎటాక్ వస్తుంది.
కేవలం మహిళల్లో మాత్రమే వచ్చే ఇతర గుండె సంబంధిత వ్యాధులు
ప్రెగ్నెన్సీ సమయంలో లేదా ప్రెగ్నెన్సీ తర్వాత గుండె ఆగిపోవడం : కొన్ని రకాల గుండె జబ్బులు కేవలం మహిళల్లో మాత్రమే చూస్తుంటాం. అటువంటి వాటిలో ముఖ్యమైనది, “పెరిపార్టమ్ కార్డియోమయోపతి”. అంటే, ప్రసావానికి కొన్ని వారాల ముందు లేదా ప్రసవం తర్వాత కొన్ని నెలలకు గుండెలో రక్తప్రసరణ తగ్గి, శ్వాస తీసుకోవడం లో ఇబ్బంది తలెత్తుతుంది. అటువంటి వారు కచ్చితంగా ఒక హృద్రోగ నిపుణుడైన వైద్యుని పర్యవేక్షణ లో ఉండాలి. వారిలో చాలామంది బాగానే కోలుకుంటారు.. కానీ కొంతమందికి మాత్రం పరిస్థితి విషమంగా అన్పిస్తే, రెండవసారి ప్రెగ్నెన్సీ లో వచ్చే హార్ట్ ఎటాక్ మరణానికి దారి తీసే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తారు.
ప్రెగ్నెన్సీ సమయంలో హై బి.పి:
సాధారణ రక్తపోటు ఉండే మహిళల్లో కూడా, 5 నెలల గర్భిణీగా ఉన్నపుడు హై బి.పి కలుగుతుంది. ప్రసవ సమయంలో హై బి.పి అనేది చాలా ఇబ్బందులకు దారి తీస్తుంది. కాబట్టి, బి.పి నియంత్రణలో ఉండటం చాలా ముఖ్యం.
ఆటో ఇమ్యూన్ (రోగనిరోధక) వ్యాధులు :
కీళ్ళవాపులు, కీళ్లవాతం మరియు ఇతర రోగానిరోధక రుగ్మతలు మగవారిలో కన్నా మహిళల్లో ఎక్కువ. ఇవి ఉన్నవారిలో హార్ట్ ఎటాక్, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువ.
క్లుప్తంగా చెప్పాలంటే, అనేక కారణాల వల్ల మహిళల్లో గుండెసంబంధిత వ్యాధులను గుర్తించడం కష్టం. కాబట్టి, వారు డయాబెటిస్, హై బి.పి, కోలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుకోవడం ద్వారా హార్ట్ ఎటాక్ ను నిరోధించడం చాలా ముఖ్యం. ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల బరువు తగ్గి, ఆరోగ్యమైన జీవితాన్ని అస్వాదించవచ్చు.