Consultation Locations

✅ Loc 1: #202, 3rd Floor, Above Khazana Jewellery, Ashish My, Madinaguda, HYD - 50 , TS ✅ Loc 2: 12H, Ground Floor, HUDA Complex, Near Dmart, Nallagandla, HYD-19 , TS

Mon-Sat: Morning: 8.00 - 10.00am, Evening: 6.00 - 9.00pm Sun: Morning: 8.30-9.30am, Evening: Closed Mon-Sat: Morning: 8.00 - 10.00am

అధిక రక్తపోటుకు గల 9 అతి సాధారణ కారణాలు!

Posted on: 30 Jun 2021

By: Dr Vinoth Kumar

Published in:

Read time:

అధిక రక్తపోటుకు కారణాలు:

90% కంటే ఎక్కువమంది రోగుల్లో అధిక రక్తపోటుకు గల ఖచ్చితమైన కారణం తెలియదు. అయితే కొన్ని ప్రమాదకారకాలు మరియు వైద్య పరిస్థితులు అధిక రక్తపోటుతో ముడి పడి ఉన్నాయి. అవి,

1.వయసు:

వయసు పెరుగుతున్న కొద్ది శరీర నిర్మాణంలో మార్పులు జరుగుతాయి. పెద్దగా సాగే గుణం ఉన్న ధమనులు గట్టిగ అవడం వల్ల బి.పి పెరుగుతుంది. ముఖ్యంగా 50 సంవత్సరాలు పైబడిన వారిలో సిస్టలిక్ బి.పి వస్తుంది.

2. కుటుంబంలో ఎవరికైనా అధిక రక్తపోటు ఉన్నట్లయితే

కుటుంబం లో తల్లికి లేదా తండ్రికి లేదా ఇద్దరికీ అధిక రక్తపోటు ఉన్నా , తోబుట్టువులకి ఉన్నా మిగతావారికి కూడా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా 60 సంవత్సరాలకు ముందే వారికి హై బి.పి వచ్చినట్లయితే ఈ అవకాశం ఇంకా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎక్కువమందికి ఉంటే కూడా హై బి.పి వచ్చే అవకాశం ఎక్కువ. జన్యు పూర్వస్థితి వల్ల, అంటే పూర్వం కుటుంబంలో హై బి.పి ఉన్నవారికి ఎవరికైనా 55 సంవత్సరాలకు ముందే గుండెపోటు లేదా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్లయితే, ఆ కుటుంబంలో హై బి.పి ఉన్న మిగతావారికి కూడా గుండెపోటు లేదా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

3.దూమపానం:

పొగ తాగిన ప్రతిసారి మనలో బి.పి తాత్కాలికంగా పెరుగుతుంది. అయితే దూమాపానాన్ని ఎక్కువకాలం కొనసాగించడం వల్ల, రక్తనాళాల్లో కొవ్వు చేరుకొని, పెద్దగా సాగె ధమనులు గట్టిగా తయారయ్యి, ఈ బి.పి శాశ్వతంగా పెరిగిపోతుంది.

4.ఎక్కువ మోతాదులో ఉప్పు తీసుకోవడం:

రోజుకు 5-6 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పును తీసుకోవడం వల్ల కూడా అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఉంది.

5.అధిక బరువు మరియు ఊబకాయం:

అధిక బరువు మరియు ఊబకాయం వల్ల కూడా హై బి.పి వచ్చే ప్రమాదం ఉంది.

6.చలనం లేని జీవనవిధానాలు మరియు వ్యాయామ కొరత :

పని విధానాల్లో వచ్చిన మార్పుల వల్ల, విశ్రాంతి సమయం ఎక్కువైంది. శారీరక శ్రమ కూడా లేకపోవడంతో ఆ విశ్రాంతి రెట్టింపయింది. ఇలా చలనం లేని జీవనవిధానాలు హై బి.పి తో ముడిపడి ఉంటాయి.

7.మద్యం సేవించుట :

తరచుగా మద్యం తీసుకోవడం వల్ల కూడా రక్తపోటు పెరుగుతుంది. అతిగా మద్యం సేవించడం, దీర్ఘకాలికంగా మద్యం సేవించడం వల్ల కూడా శాశ్వతంగా హైబి.పి వచ్చే అవకాశం ఉంది.

8.హై బి.పి ని పెంచే కొన్ని వైద్యపరిస్థితులు:

థైరాయిడ్ సమస్యలు, కిడ్నీ వ్యాధులు, అడ్రినల్ గ్రంథి వ్యాధులు, నిద్ర కి సంబందించిన రుగ్మతలు కూడా చిన్న వయసులోనే రక్తపోటు రావడానికి కారణం అవొచ్చు. పెద్దగా ఉండాల్సిన ధమనులు సన్నగా అవడం వంటి పుట్టుకతో వచ్చే సమస్యల వల్ల చిన్నతనంలోనే అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఉంది. గర్భం సమయంలో కూడా అధిక రక్తపోటుకు గురి కావొచ్చు.

9.రక్తపోటుని పెంచే మందులు :

ఎక్కువ కాలంగా పెయిన్ కిల్లర్స్, ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్, అలాగే మానసిక చికిత్సకు సంబందించిన మందులు, ముక్కులో వేసుకునే డ్రాప్స్ వంటి వాటితో కూడా హై బి.పి కి సంబంధం ఉంది. కాబట్టి, హై బి.పి ఉన్న ప్రతిఒక్కరు, తాము వాడే మిగతా మందుల గురుంచి డాక్టర్ తో చెప్పాలి.ఆ మందులు హై బి.పి ని పెంచేవి కూడా అయి ఉండొచ్చు కాబట్టి.