Consultation Locations
✅ NALLAGANDLA BRANCH : Plot No:12H, Ground floor, HUDA COMPLEX
Near D Mart, Kanchi Gachibowli Road, Nallagandla, Hyderabad, Telangana - 500019
Timing : Morning : Mon - Sat: 8.00 AM - 10.30 AM
Evening : Mon, Wed, Fri - 5.30pm - 9pm
✅ CHANDA NAGAR BRANCH : 202, 3ʳᵈ floor, Ashish MySpace,
Above khazana Jewellery, Chandanagar, Hyderabad, Telangana - 500050
Timing : Available 3 Days in a week
Evening : Tues, Thurs, Sat - 5.30pm - 9pm
ట్రైగ్లిజరైడ్స్ అంటే ఏమిటి?
ట్రైగ్లిజరైడ్ అనేది లివర్ లేదా కొవ్వు కణాల్లో నిల్వ ఉంచబడిన ఒక రకమైన కొవ్వు పదార్ధం. మనం అవసరమైన దానికన్నా ఎక్కువ క్యాలోరిస్ ను తీసుకున్నపుడు, ఆ అదనపు క్యాలోరిస్ ట్రైగ్లిజరైడ్స్ గా మార్చి నిల్వ చేయబడతాయి.
ఎపుడు మనం అధిక ట్రైగ్లిజరైడ్స్ కలిగి ఉన్నారు అంటాము?
ఎపుడైతే ఒక వ్యక్తి యొక్క ఫాస్టింగ్ ట్రైగ్లిజరైడ్స్ విలువ 200mg/dl కన్నా ఎక్కువగా ఉంటుందో, అపుడు అతన్ని అధిక ట్రైగ్లిజరైడ్స్ కలిగిఉన్నట్టుగా పిలుస్తాము.
రక్తంలో అధిక ట్రైగ్లిజరైడ్స్ ను కలిగి ఉండటానికి గల సాధారణ కారణాలు ఏంటి?
మధుమేహం
అధిక బరువు, ఊబకాయం
అతిగా మద్యం సేవించుట
దూమపానం
థైరాయిడ్ సమస్యలు
మూత్రపిండాలు(కిడ్నీ) లేదా కాలేయం (లివర్) చెడిపోవడం
స్టెరోయిడ్స్ వంటి మత్తు టాబ్లెట్లను రోజు తీసుకోవడం
చలనం లేని జీవనశైలి
సంతృప్త కొవ్వు పదార్దాలను ఎక్కువగా తీసుకోవడం
అధిక ట్రైగ్లిజరైడ్స్ ను కలిగి ఉండటం వల్ల కలిగే ప్రమాదాలు ఏంటి?
క్లోమవ్యాధి(ప్యాంక్రియాటైటిస్) ఒక ప్రధాన సమస్య, ముఖ్యంగా ట్రైగ్లిజరైడ్స్ సంఖ్య 500mg/dl కన్నా ఎక్కువ ఉన్నపుడు. గుండె నాళాల్లో అడ్డంకులు మరియు గుండెపోటు వచ్చే ప్రమాదవకాశాలు పెరుగుతాయి. కొవ్వు గల కాలేయానికి సంబందించిన వ్యాధులు తలెత్తడం.
ట్రైగ్లిజరైడ్స్ ను తగ్గించుకునే ఉత్తమ విధానం ఏంటి?
జీవనవిధానాల్లో మార్పు, ఆహార నియమాల మార్పు, మందులు వాడటం వంటివి రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ ను తగ్గించుకోవడానికి ఉత్తమమైన మరియు అతి ముఖ్యమైన పద్ధతి.
మందులు వాడకుండా ట్రైగ్లిజరైడ్స్ ను తగ్గించుకునే విధానాలు ఏమిటి?
ఆహారం
కార్బొహైడ్రేట్స్ తీసుకోవడాన్ని తగ్గించడం:
కార్బొహైడ్రేట్స్ నుండి వచ్చే క్యాలోరిస్ ను తీసుకోవడాన్ని 50% కన్నా తక్కువ కి తగ్గించడం
శుద్ధి చేయబడిన కార్బొహైడ్రేట్స్ మరియు సాధారణ చక్కెర వాడకం కూడా ఎంత వీలైతే అంత తగ్గించాలి.
టేబుల్ షుగర్, తేనే, చాకోలెట్స్, ఫ్రూట్ జామ్స్, కేక్స్, క్యాండీస్, ఐస్ క్రీంస్, సోడా వంటి చక్కెర పదార్ధాలు, అలాగే తెల్ల బియ్యం, పొట్టు తీసిన పిండి వంటి కార్బొహైడ్రేట్స్ ను తగ్గించాలి.
శుద్ధి చేయబడిన కార్బొహైడ్రేట్స్ ను కాయగూరలు, తృణధాన్యాలు మరియు పండ్లతో భర్తీ చేయండి.
ఆరోగ్యాకరమైన శరీరం కోసం రోజుకి 50% కన్నా ఎక్కువ సంక్లిష్ట కార్బొహైడ్రేట్స్ అవసరం.సంక్లిష్ట కార్బొహైడ్రేట్స్ లో పీచు పదార్ధం ఎక్కువగా ఉంటుంది కాబట్టి జీర్ణం అవడానికి మరియు రక్తం లో కలవడానికి సమయం పడుతుంది. ఇది కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది కాబట్టి, క్యాలోరిస్ వినియోగం కూడా తగ్గుతుంది. గ్లైసెమిక్ సూచిక విలువలు ఎక్కువగా ఉండే ఆహారపదార్ధాలు తీస్కుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు, అలాగే ట్రైగ్లిసరైడ్స్ స్థాయిలు కూడా పెరుగుతాయి.
కొవ్వు పదార్ధాల వినియోగం :
కార్బొహైడ్రేట్స్ ను ఏకఅసంతృప్త కొవ్వు ఆమ్లాలు(MUFA) మరియు బహుళఅసంతృప్త కొవ్వు ఆమ్లాలతో (PUFA) భర్తీ చేయండి. సముద్ర మూలాల నుండి లభించే ఒమేగా 3 ఫాటీఆసిడ్స్, ట్రైగ్లిసరైడ్స్ ను తగ్గించడంలో బాగా ఊయోగపడతాయి. సంతృప్త కొవ్వు ఆమ్లాలు తగ్గించి, ఒమేగా 3,6, MUFA, PUFA వంటివి ఎక్కువగా తీసుకోవడం మంచిది.
బరువు తగ్గడం :
ట్రైగ్లిసరైడ్స్ ను తగ్గించుకోవడానికి తక్కువ క్యాలోరిస్ ను తీసుకొని, బరువు తగ్గించుకోవడం చాలా ముఖ్యం. ప్రతి ఒక్క కేజీ తగ్గుదల వల్ల ట్రైగ్లిసరైడ్స్ లో 8mg/dl తగ్గుతుంది.
మద్యం తగ్గించుట :
మద్యపానం సేవించే వారికన్నా, మద్యం మానేసిన వారిలో 80% ట్రైగ్లిసరైడ్స్ తగ్గాయి. ట్రైగ్లిసరైడ్స్ 500mg/dl కన్నా ఎక్కువగా ఉంటే దీనియొక్క ప్రయోజనాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి.
శారీరక వ్యాయామం :
రోజు చేసే 30 నిముషాల నడక వంటి శారీరక వ్యాయామం వల్ల శరీర బరువు మరియు ట్రైగ్లిసరైడ్స్ కూడా 20% కన్నా ఎక్కువ తగ్గుతాయి.
క్లుప్తంగా చెప్పాలంటే, అధిక ట్రైగ్లిసరైడ్స్ ఉన్న రోగులు, తక్కువ క్యాలోరిస్, తక్కువ కార్బొహైడ్రేట్స్, తక్కువ చక్కెర ను తీసుకోవాలి. శారీరక వ్యాయామం మరియు మద్యపానం మానేయడం ద్వారా శరీర బరువును తగ్గించుకోవాలి. అవిసె గింజలు, చియా గింజలు, ఆలీవ్ ఆయిల్, ఆకుకూరలు, కాయగూరలు, సముద్ర చేపలను ఎక్కువగా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ట్రైగ్లిసరైడ్స్ పెరిగిన వెంటనే తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఒక్కసారి ట్రైగ్లిసరైడ్స్ 500mg/dl కన్నా ఎక్కువ పెరిగినట్లయితే, గుండెపోటు మరియు ప్యాంక్రియాటిస్ నుండి తప్పించుకోవడానికి..జీవన విధానాల్లో మార్పులతో పాటుగా మందులు కూడా తీసుకోవడం తప్పనిసరి అవుతుంది.