Consultation Locations

✅ NALLAGANDLA BRANCH : Plot No:12H, Ground floor, HUDA COMPLEX
Near D Mart, Kanchi Gachibowli Road, Nallagandla, Hyderabad, Telangana - 500019
Timing : Morning : Mon - Sat: 8.00 AM - 10.30 AM
                  Evening : Mon, Wed, Fri - 5.30pm - 9pm

✅ CHANDA NAGAR BRANCH : 202, 3ʳᵈ floor, Ashish MySpace,
Above khazana Jewellery, Chandanagar, Hyderabad, Telangana - 500050
Timing :   Available 3 Days in a week
                   Evening : Tues, Thurs, Sat - 5.30pm - 9pm

ఉప్పు మరియు మీ ఆరోగ్యం – ఉప్పు వినియోగానికి సంబందించిన నిజానిజాలు:

Posted on: 24 Jul 2021

By: Dr Vinoth Kumar

Published in:

Read time:

ఉప్పు అంటే ఏమిటి?

సోడియం క్లోరైడ్ నే ఉప్పుగా పిలుస్తాము. ఇందులో 40% సోడియం, 60% క్లోరైడ్ ఉంటుంది. ఆహారంలో రుచిని పెంచడానికి మరియు ఆహారాన్ని నిల్వ ఉంచడానికి ఉప్పును ఉపయోగిస్తాము. అందుకే, ప్రాసెస్ చేయబడిన చిరుతిండ్లు, మాంసం మరియు పచ్చళ్ళలో బాక్టీరియా రాకుండా ఉండటానికి ఉప్పుని అధికంగా ఉపయోగిస్తారు.

ఉప్పులో ఉన్న వివిధ రకాలేమిటి?

అన్ని రకాల ఉప్పులు కూడా అయితే సముద్రపు నీటిని ఇగర్చడం లేదా ఉప్పు గనులను తవ్వడం ద్వారా తయారుచేస్తారు. మార్కెట్లోకి వచ్చేముందు, శుద్ధి చేసే ప్రక్రియ ద్వారా ఉప్పులోని మలినాలను తొలగిస్తారు. సాధారణంగా అన్ని రకాల ఉప్పుల్లో సోడియం క్లోరైడ్ ఉంటుంది. పండ్లు, కూరగాయలు మరియు పాల ఉత్పత్తులతో పోలిస్తే ఉప్పులో ఉండే ఖనిజశాతం(minerals) చాలా తక్కువ.

టేబుల్ సాల్ట్ :

ఇది భూగర్భపు ఉప్పు నిల్వల నుండి తయారుచేయబడుతుంది. ఇది చాలా దశల్లో శుభ్రపరిచబడుతుంది కాబట్టి, మినరల్స్ అనేవి పూర్తిగా తొలగించబడతాయి. థైరాయిడ్ సమస్యల నుండి శరీరాన్ని రక్షించుకోవడానికి ఐయోడిన్ అవసరం కాబట్టి, మార్కెట్లో దొరికే అన్ని టేబుల్ సాల్ట్స్ లో ఐయోడిన్ చేర్చబడుతుంది.

హిమాలయన్ పింక్ సాల్ట్ :

ఇది పాకిస్తాన్లోని పెద్ద గనుల నుండి తవ్వబడుతుంది. ఇందులో ఉండే ఐరన్ ఆక్సైడ్ వల్ల ఇది గులాబీ రంగులో ఉంటుంది. సహజసిద్ధమైన మరియు తక్కువ పద్ధతుల్లో శుద్ధికరించడం వలన టేబుల్ సాల్ట్ తో పోలిస్తే ఇందులో మినరల్స్ ఎక్కువగా ఉంటాయి.

కోషెర్ సాల్ట్ :

ఇది పెద్ద పలుకులుగా ఉంటుంది. ఇది ఆహారానికి రుచిని పెంచుతుంది. ఇందులో ఐయోడిన్ లేకపోవడం వల్ల చేదుగా ఉండదు.

సముద్రపు ఉప్పు :

ఇది కూడా పెద్ద పలుకులుగా ఉంటుంది. ఇది కూడా టేబుల్ సాల్ట్ లాంటిదే. ఇందులో ప్లాస్టిక్ మరియు ఇతర లోహాల జాడలు ఉండవచ్చు.

ఉప్పు ఆరోగ్యానికి చెడు చేస్తుందా?

శరీర కండరాలు మరియు నరాల పనితీరుకి సోడియం చాలా అవసరం. కానీ అధిక ఉప్పు శరీరానికి హానికరం. అధిక ఉప్పు శరీరం నుండి ఎక్కువ నీటిని గ్రహించి, గుండె మరియు రక్తానాళాల మీద ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. అలాగే కిడ్నీ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి, ఉప్పు యొక్క చెడు ప్రభావాలను దృష్టిలో పెట్టుకుని, ప్రత్యక్షంగాను, పరోక్షంగాను కూడా ఉప్పు వినియోగంలో జాగ్రత్త వహించాలి.

ఉప్పు అధికంగా ఉండే పదార్ధాలు ఏంటి?

ఇంచుమించు మనం ప్రతిరోజు వాడే పాల ఉత్పత్తులు, పండ్లు, కాయగూరలు మరియు ధాన్యాలలో సోడియం ఉంటుంది. 60-70% కన్నా ఎక్కువ శాతం ఉప్పు రెస్టారెంట్, ప్రాసెస్డ్ ఆహారంలో ఉంటుంది. కాబట్టి ఈ ఆహారాన్ని తీసుకోవడం తగ్గించడం మంచిది..

ఉప్పు అధికంగా ఉండే ఆహారపదార్ధాలు :

• ప్రాసెస్ చేయబడిన మాంసం
• ప్రాసెస్డ్ స్నాక్స్
• ఊరగాయలు
• పిజ్జా, బర్గర్, శాండ్విచ్స్
• చిప్స్, సూప్స్
• వెన్న, ఆమ్లెట్స్

ప్రతిరోజూ తీసుకొదగిన ఉప్పు మోతాదు ఎంత?

ప్రపంచవ్యాప్తంగా తీసుకునే సోడియం 3.5 నుండి 5.5 గ్రాములు ఉంటుంది. (అంటే రోజుకి 9-12 గ్రాముల ఉప్పు ). ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన దాని ప్రకారం 2 గ్రాముల సోడియం (అంటే రోజుకి 5 గ్రాముల ఉప్పు) సరైనది. 5 గ్రాముల ఉప్పు అంటే ఒక టీ స్పూనుకి సమానం.

అధికంగా ఉప్పు తీసుకోవడం వల్ల బి.పి పెరుగుతుందా?

50% బీపీ పేషెంట్స్ కి ఉప్పు పడదు. అంటే ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల బీపీ కూడా పెరుగుతుందన్నమాట.

ఆహారంలో ఉప్పు తగ్గించడం వల్ల వచ్చే లాభాలేంటి?

• హైపర్ టెన్షన్ వృద్ధిని మందగిస్తుంది.
• హై బీపీ పేషెంట్స్ లో గుండె పట్టేయడాన్ని తగ్గిస్తుంది.
• మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో హైపర్ టెన్షన్ ఉన్న, లేకపోయినా కిడ్నీ నష్టాన్ని తగ్గిస్తుంది.
• శరీరంలో ప్రో ఇన్ఫ్లమాటరీ కారకాలను తగ్గించి, ఆంటి ఇన్ఫ్లమాటరీ కారకాలను పెంచుతుంది.

రోజువారీ ఆహారంలో సోడియంను తగ్గించడం వల్ల కలిగే లాభం, పొటాషియం పెంచడం వల్ల పెరుగుతుంది మరియు పొటాషియం తగ్గించడం వల్ల తగ్గుతుంది.

ఒక్క మాటలో చెప్పాలంటే, పొటాషియంను పెంచకుండా కేవలం ఉప్పుని తగ్గించడం వల్ల బీపీ తగ్గదు. కానీ ఉప్పుని తగ్గించి, పొటాషియంను పెంచే పండ్లు కూరగాయలను తీసుకోవడం ద్వారా రక్తపోటు చాలా వరకు తగ్గుతుంది.

రోజువారీ ఆహారంలో ఉప్పుని తగ్గించుకోవడం ఎలా?

•వండేటపుడు రోజు కన్నా 50% తక్కువ ఉప్పుని మాత్రమే వేయండి.
•వండిన తర్వాత ఉప్పుని కలపకండి.
•పచ్చళ్ళు, అప్పడాలు తగ్గించండి.
•ప్రాసెస్డ్ ఫుడ్, స్నాక్స్ ను తగ్గించండి.
• ఆహారం రుచిగా లేదనిపిస్తే, ఉప్పుకి బదులుగా జీలకర్ర, మిరియాలు వంటివి, సుగంధద్రవ్యాలు, ఇంకా నిమ్మరసం వాడండి.

ఉప్పు వినియోగానికి సంబందించిన వాస్తవాలు :

అవాస్తవం 1- తక్కువ సోడియం కలిగి ఉండటంవల్ల హిమాలయన్ సాల్ట్, బ్లాక్ సాల్ట్ మరియు సముద్రపు ఉప్పు ఆరోగ్యానికి మంచివి.

వాస్తవం – అన్ని రకాల ఉప్పులలోనూ 40% సోడియం ఉంటుంది. అయితే ఖనిజశాతం మారవచ్చు. ఉప్పు ఏదైనప్పటికి, సూచించిన మోతాదు కంటే ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంపై చెడు ప్రభావం పడుతుంది.

అవాస్తవం 2- ఉప్పుని తగ్గించడం వల్ల బీపీ తగ్గుతుంది కాబట్టి, నేను నా ఆహారం నుండి పూర్తిగా ఉప్పుని తొలగిస్తాను.

వాస్తవం – శరీరంలోని కండరాలు, నరాల వ్యవస్థకు కావాల్సిన ముఖ్యమైన ఖనిజం ఉప్పు. కాబట్టి పూర్తిగా ఉప్పుని మానేయడం వల్ల శరీరంపై చెడు ప్రభావం పడుతుంది.

అవాస్తవం 3- తక్కువ ఉప్పు గల ఆహారాన్ని నేను తినలేను, నాకు అలవాటు లేదు.వాస్తవం – ఒకసారి మనం ఉప్పుని తగ్గించడం ప్రారంభించాక, నెమ్మదిగా మన నాలుక అలవాటు పడుతుంది. ఆ తర్వాత తక్కువ ఉప్పుకి, ఎక్కువ ఉప్పుకి పెద్దగా తేడా కూడా తెలియదు.

అవాస్తవం 4 – వృద్ధులలోనే బీపీ ఎక్కువగా వస్తుంది కాబట్టి,చిన్న వయసులో నేను ఎక్కువ ఉప్పుని తీసుకోవచ్చు.

వాస్తవం – బీపీ అనేది ఏ వయసులో అయినా పెరగవచ్చు. నిజానికి ఈ మధ్య కాలంలో తక్కువ వయసు వారిలోనే బీపీ ఎక్కువగా పెరుగుతుంది. దీనికి కారణం అధిక ఉప్పుని వినియోగించడం, వ్యాయామం లేకపోవడం, ఓబెసిటీ కావొచ్చు.

అవాస్తవం 5- కేవలం ఎక్కువ ఉప్పు వల్లనే ఆహారానికి ఎక్కువ రుచి వస్తుంది.

వాస్తవం – తక్కువ ఉప్పుతో కూడా సుగంధ ద్రవ్యాలు, నిమ్మరసం వంటివి వాడి రుచిని పెంచుకోవచ్చు.

అవాస్తవం 6- వండేటపుడు ఉప్పుని తగ్గించినట్లయితే, నా రోజువారీ ఉప్పు వినియోగం కూడా బాగా తగ్గిపోయినట్లే.

వాస్తవం – 70% కన్నా ఎక్కువశాతం ఉప్పు ప్రాసెస్డ్ ఫుడ్, పచ్చళ్ళు నుండి వస్తుంది కాబట్టి వంటలో ఉప్పుతో పాటు వీటిని కూడా తగ్గించాలి.

అవాస్తవం 7- నా బీపీ నార్మల్ గానే ఉంది కాబట్టి నేను ఎక్కువ ఉప్పు తీసుకోవచ్చు.

వాస్తవం – బీపీ లేనివారు కూడా తక్కువ ఉప్పుని వాడటం వల్ల బీపీ పెరగకుండా అదుపులో ఉంచుకోవచ్చు.