Consultation Locations
✅ NALLAGANDLA BRANCH : Plot No:12H, Ground floor, HUDA COMPLEX
Near D Mart, Kanchi Gachibowli Road, Nallagandla, Hyderabad, Telangana - 500019
Timing : Morning : Mon - Sat: 8.00 AM - 10.30 AM
Evening : Mon, Wed, Fri - 5.30pm - 9pm
✅ CHANDA NAGAR BRANCH : 202, 3ʳᵈ floor, Ashish MySpace,
Above khazana Jewellery, Chandanagar, Hyderabad, Telangana - 500050
Timing : Available 3 Days in a week
Evening : Tues, Thurs, Sat - 5.30pm - 9pm
ట్రాన్స్ ఫ్యాట్స్ అంటే ఏమిటి?
మనకు మార్కెట్ లో దొరికే ట్రాన్స్ ఫ్యాట్స్ చాలా వరకు, పారిశ్రామిక పధ్ధతిలో, వెజిటేబుల్ ఆయిల్ కి హైడ్రోజెన్ ను కలపడం ద్వారా గది ఊష్ణోగ్రత వద్ద ఘనీభవింపచేసి తయారుచేస్తారు. ఇండియాలో చాలా ఎక్కువగా ఉపయోగించే హైడ్రోజెనేటెడ్ వెజిటేబుల్ ఆయిల్స్ లో వనస్పతి ఒకటి. ఇందులో ఎక్కువశాతం హానికరమైన ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి.
ట్రాన్స్ ఫ్యాట్స్ ను వినియోగించడం ఆరోగ్యానికి హానికరమా?
అవును. ఇది చాలా చెడ్డ కొవ్వుగా పరిగణించబడుతుంది. అతి తక్కువ పరిమాణంలో వినియోగించినప్పటికి, ఇవి ప్రమాదకరమే.
అయితే రోజుకి ఎంతవరకు ట్రాన్స్ ఫ్యాట్స్ ని తీసుకోవచ్చు?
ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన ప్రకారం, రోజుకి మనం తీసుకునే మొత్తం శక్తిలో 1% కన్నా తక్కువ ట్రాన్స్ ఫ్యాట్స్ ఉండాలి. అంటే, 2000 క్యాలోరిల డైట్ లో 2.2 గ్రాముల కన్నా తక్కువ అన్నమాట. బయట తినడం, రెస్టారెంట్స్ లో తినడం వంటి అలవాట్ల వల్ల ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ వినియోగం పెరిగిపోతుంది. గైడ్ లైన్స్ ప్రకారం 2% కన్నా మించరాదు. కానీ చాలా వనస్పతి బ్రాండ్లలో ఇది 20-30% కన్నా ఎక్కువ ఉంటుంది.
ట్రాన్స్ ఫ్యాట్స్ యొక్క సాధారణ మూలాలు ఏంటి?
సాధారణంగా వినియోగించే బర్ఫి, గులాబ్ జామున్, హల్వా, జిలేబి, కచోరీ, చూరా, బిర్యానీ, ఆలూ పూరి వంటి భారతీయ వంటకాలు, ఎక్కువ ట్రాన్స్ ఫ్యాట్స్ ఉండే వనస్పతితోనే తయారు చేస్తారు.
ట్రాన్స్ ఫ్యాట్స్ లో 80% వరకు పారిశ్రామిక ఉత్పత్తుల నుండే వస్తున్నాయి (కేక్స్, బిస్కెట్స్, చిప్స్, పాప్ కార్న్, పేస్ట్రీస్ వంటివి ) కేవలం 20% ట్రాన్స్ ఫ్యాట్స్ మాత్రం మాంసం, పాలు వంటి సహజసిద్ద పదార్ధాల నుండి వస్తున్నాయి.
వేపుళ్ల వల్ల ట్రాన్స్ ఫ్యాట్స్ ఉత్పత్తి అవుతాయా?
వేపుళ్ల వల్ల ట్రాన్స్ ఫ్యాట్స్ ఉత్పత్తి అవ్వవు. సాధారణ వేపుడులో ఎడిబుల్ ఆయిల్స్ నుండి వచ్చే ట్రాన్స్ ఫ్యాట్స్ వల్ల అతి కొద్దిగా ప్రభావం ఉండవచ్చు. అయితే ఆయిల్ ను అధిక ఉష్ణోగ్రత వద్ద ఎక్కువ సేపు వేడి చేసినప్పుడు, ఒకే ఆయిల్ ను పదే పదే వాడినపుడు మాత్రం ట్రాన్స్ ఫ్యాట్స్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది.
ట్రాన్స్ ఫ్యాట్స్ ను వినియోగించడం వల్ల కలిగే హానికర ఫలితాలేంటి?
ట్రాన్స్ ఫ్యాట్స్ చెడు కొలెస్ట్రాల్ ను పెంచుతుంది అలాగే మంచి కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.
ఇది శరీరంలో వేడిని పెంచి, డయాబెటీస్, బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ వంటివి రావడానికి కారణం కూడా అవుతుంది. తక్కువ పరిణామంలో తీసుకోవడం కూడా మన ఆరోగ్యానికి ప్రమాదమే.
ట్రాన్స్ ఫ్యాటీయాసిడ్స్ వినియోగం వల్ల యేటా ప్రపంచంలో 5 లక్షల మరణాలు నమోదు అవుతున్నాయి.
ట్రాన్స్ ఫ్యాటీయాసిడ్స్ వినియోగం తగ్గించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటి?
భారతదేశ ఆహార భద్రత మరియు ప్రమాణాల అధికార సంస్థ (FSSAI), జనవరి 2021 నాటికి అన్ని ఎడిబుల్ ఆయిల్స్, వనస్పతి, బేకరీ షార్టనింగ్, వెజిటేబుల్ ఫ్యాట్ స్ప్రెడ్, మిక్స్డ్ ఫ్యాట్ స్ప్రెడ్ లలో కేవలం 3% కన్నా తక్కువ ట్రాన్స్ ఫ్యాట్స్ ఉండాలని, జనవరి 2022 నాటికి 2% కన్నా తక్కువ ట్రాన్స్ ఫ్యాట్స్ ఉండాలని ప్రకటించింది.
ట్రాన్స్ ఫ్యాట్స్ హానికరం అయినట్లయితే, ఎక్కువ కొవ్వు ఉండే ఆహార పదార్ధాలని తగ్గించడం మంచిదేనా?
ట్రాన్స్ ఫ్యాటీయాసిడ్స్ మీద భయంతో మనం సాధారణంగా ఉపయోగించే మాంసం మరియు పాల పదార్ధాలను మానేయడం మంచిది కాదు. ఎందుకంటే, వాటిలో ట్రాన్స్ ఫ్యాటీయాసిడ్స్ కన్నా ఐరన్, కాల్షియం, ప్రోటీన్ వంటివి అధికంగా ఉంటాయి.అలాగే ఫ్యాట్, ఆయిల్స్ వంటివి తక్కువగా తీసుకుంటే శరీరంలో విటమిన్ ‘ఈ’ వంటి ముఖ్య ఫాటీ ఆసిడ్స్ కొరత ఏర్పడి, హెచ్.డి.ఎల్, ట్రైగ్లిసరైడ్స్ లలో అవాంఛనీయ మార్పులు కలగవచ్చు.
రెస్టారెంట్లలోనూ, ఆహార పరిశ్రమల్లొను వనస్పతి ని తగ్గించి, వేరే ప్రత్యామ్నాయం చేయడం ద్వారా కచ్చితంగా గుండెజబ్బులు, డయాబెటీస్, బ్రెయిన్ స్ట్రోక్ వంటివి తగ్గుముఖం పడతాయి.