Consultation Locations
✅ NALLAGANDLA BRANCH : Plot No:12H, Ground floor, HUDA COMPLEX
Near D Mart, Kanchi Gachibowli Road, Nallagandla, Hyderabad, Telangana - 500019
Timing : Morning : Mon - Sat: 8.00 AM - 10.30 AM
Evening : Mon, Wed, Fri - 5.30pm - 9pm
✅ CHANDA NAGAR BRANCH : 202, 3ʳᵈ floor, Ashish MySpace,
Above khazana Jewellery, Chandanagar, Hyderabad, Telangana - 500050
Timing : Available 3 Days in a week
Evening : Tues, Thurs, Sat - 5.30pm - 9pm
పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని మనలో చాలామందికి తెలుసు. పండ్లు మరియు కూరగాయలతో అనేక ఆహార ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయి. పండ్లు, కూరగాయల యొక్క మోతాదు మరియు వాటి వినియోగం గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.
కూరగాయలు
పోషక విలువలు:
అన్ని రకాల పచ్చని, ఎర్రని మరియు నారింజ రంగు కూరగాయలు, చిక్కుడు జాతికి చెందిన బీన్స్, బఠాణి వంటివి రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. వీటి ద్వారా విటమిన్-ఎ, విటమిన్-కె, విటమిన్-ఇ, విటమిన్-సి, బీటా కెరొటీన్, ఫోలేట్, విటమిన్-బి1, బి2, బి3, బి5 మరియు బి6 వంటివి మనకు లభిస్తాయి.
అధిక మినరల్ శాతం – ఐరన్, మెగ్నిషియం, పోటాషియం, జింక్, కాల్షియం, ఫాస్పరస్ మరియు సోడియం వంటి మినరల్స్ ఆకుకూరలు, కాయగూరల్లో సహజసిద్ధంగా లభిస్తాయి.
మనం అన్ని రకాల కాయగూరల్ని తప్పకుండ తీసుకోవాలి, ఎందుకంటే ఆకుపచ్చని కాయగూరల్లో విటమిన్ -కె అధికంగా ఉంటుంది. ఎర్రని మరియు నారింజ రంగు కూరగాయల్లో విటమిన్-ఎ అధికంగాను, అలాగే చిక్కుడు జాతికి చెందిన బీన్స్, బఠాణిల్లో పీచు పదార్ధం ఎక్కువగాను లభిస్తుంది.
పిండి పదార్ధం ఎక్కువగా ఉండే కాయగూరల్లో పోటాషియం ఎక్కువగా లభిస్తుంది.(ఉదాహరణకు: జొన్న, బంగాళాదుంప, పచ్చిబఠాణి, బీట్రూట్)
తీసుకోవాల్సిన పరిమాణం:
మనం కనీసం రోజుకి 5సార్లు కూరగాయల్ని తీసుకోవాలి.. ప్రతిరోజూ మనం ఎంత తింటున్నామో కొలవడం అసాధ్యం.
కాబట్టి, ఉదాహరణకు 1 సర్వీంగ్ అనగా :
•చిన్న కప్పు ఆకుకూరలు (లేదా)
•అరకప్పు ఉడికించిన కాయగూరలు (క్యారట్, బ్రోకోలి వంటివి ) (లేదా)
•అరకప్పు పచ్చి బఠాణి, బీన్స్.
పండ్లు
పోషక విలువలు:
అన్ని కాలాల్లో దొరికే పండ్లని తీసుకోవాలి. ముఖ్యంగా పండ్లరసాల కన్నా పండ్లను తీసుకోవడం మంచిది.
బొప్పాయి, జామ, ఆపిల్, ద్రాక్ష, మామిడి, మరియు ఇతర పండ్లలో బెటాకెరొటీన్, యాంటి ఆక్సిడెంట్స్, విటమిన్ -సి, పొటాషియమ్ మరియు విటమిన్ -బి కలిగి ఉండటం వల్ల శరీరానికి కావాల్సిన వ్యాధి నిరోధక శక్తీ, పూర్తి ఆరోగ్యం సమకూరుతుంది.
పుల్లని పండ్లయిన నిమ్మ మరియు నారింజ పండ్లలో విటమిన్ -సి అధికంగా ఉంటుంది. జ్యూస్ కన్నా పండ్లను నేరుగా తీసుకోవడం మంచిది. ఎందుకు కారణాలు :
1.ఎక్కువ శాతం విటమిన్స్, మినరల్స్, ఫైబర్లు, ఫ్లావానోయిడ్స్ ను కలిగి ఉంటాయి. జ్యూస్ చేసినపుడు తొక్కను తీసివేస్తాం కాబట్టి అందులో ఉండే ఫైబర్, మినిరల్స్ మరియు విటమిన్స్ తగ్గిపోతాయి.
2. ఎపుడైతే మనం ఒక పండును నోటితో నములుతామో , అది మన పొట్టకి సమాచారం పంపుతుంది. వెంటనే కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. ఇదే జీర్ణక్రియకు మొదటి దశ. అదే పండ్లరసాన్ని తగినట్లయితే ఈ దశ అధిగమించబడుతుంది.
3. ఎపుడైతే మనం ఒక పండును తీసుకుంటామో, షుగర్ శాతం ఒకేసారి పెరగకుండా ఉంటుంది. పీచు శాతం ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ నెమ్మదిగా జరిగి, గ్యాస్ట్రిక్ తగ్గిస్తుంది. ఆకలిని తగ్గించి, సంతృప్తిని కలిగిస్తుంది. పండ్లరసాలలో పీచు పదార్ధం లేకపోవడం వల్ల త్వరగా జీర్ణం అయ్యి, రక్తంలోని షుగర్ లెవెల్స్ పెరుగుతాయి.
4.పండ్ల రసం కన్నా పండ్ల వల్ల వచ్చే క్యాలోరిస్ తక్కువగా ఉంటాయి. జ్యూస్ లో వాడే చక్కెర వల్ల క్యాలోరిస్ పెరిగి, అధిక బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది. చిన్న వయసులోనే జ్యూస్ లను అలవాటు చేయడం వల్ల ఊబకాయం వచ్చే అవకాశం కూడా ఉంది.
5. పండ్లలో ఆంటి ఆక్సిడెంట్స్, ఫాయిటోస్టేరోల్స్, ఫ్లావనోయిడ్స్, వంటి ఆరోగ్యాకరమైన శరీరానికి అవసరమైనవి ఉంటాయి. అదే జ్యూస్ అయితే ఈ ఫాయిటోకెమికల్స్ పండ్ల తొక్కలోనే ఉండిపోతాయి.
తీసుకోవాల్సిన పరిమాణం:
రోజుకి 5 సర్వీంగ్స్ పండ్లు
పండు మోతాదు
•ఒక గుప్పెడంత /మీడియం సైజు ఆపిల్ లేదా ఆరంజ్
• 1/4 కప్పు లేదా ఒక గుప్పెడంత డ్రై ఫ్రూట్స్
పండ్లు, కూరగాయల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
పండ్లు, కూరగాయలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గుతుంది.
అలాగే గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
కొన్ని రకాల కాన్సర్లను కూడా రాకుండా చేస్తుంది.
మలబద్ధకం మరియు ఇన్ఫ్లమాటరీ బౌల్ వ్యాధిని వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
రక్తంలోని చక్కెర స్థాయిపై సానుకూలంగా ప్రభావం చూపి, ఆకలిని అదుపులో ఉంచుతుంది.ఆపిల్స్, పీర్స్ మరియు ఆకుకూరలు వంటివి పిండి పదార్ధం లేని వాటిని తీసుకోవడం ద్వారా బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది.