డయాబెటిక్ పేషెంట్లు ఎప్పుడు ఏం తినాలి, ఏం తినకూడదు అనే సందేహాన్ని కలిగి ఉంటారు. చాలా సార్లు వారు డైట్ ప్లాన్ కి సంబంధించిన కరపత్రాలను అందుకుంటారు. ఇపుడు మనం ఇండియన్ డైట్ లో ఒక రోజు మొత్తానికి ఒక ప్లాన్ ని చర్చిద్దాం. దీని నుండి మీరు మీ అభిరుచికి అనుగుణంగా పదార్ధాలని కలపడానికి ఇంకా మీ క్రియేటివిటీ కి తగ్గటుగా ఐటెమ్స్ ఎంచుకోవడానికి సహాయపడుతుంది.
ఉదయాన్నే-అర కప్పు పాలు లేదా కాఫీ లేదా టీ (మీకు నచ్చితే గ్రీన్ టీ మంచిది)-అన్నీ చక్కెర లేకుండా
బ్రేక్ ఫాస్ట్- కింది వాటిలో ఏదైనా ఒకటి
- వెజిటబుల్ స్టఫ్ డ్ చపాతీ లేదా రోటీ
- తక్కువ నూనెతో 3 మిల్లెట్ ఇడ్లీ లేదా 2 మిల్లెట్ దోసె
- కూరగాయలతో ఓట్స్ లేదా బార్లీ గంజి
- వెజిటబుల్ దాలియా
- హోల్ వీట్ బ్రెడ్ లేదా హోల్ వీట్ పాస్తా
- గోధుమలు లేదా బక్క్వీట్ లేదా క్వినోవా లేదా పోహాతో ఉప్మా
మిడ్‌మార్నింగ్ స్నాక్– కింది వాటిలో ఏదైనా ఒకటి
- పండ్లు – నారింజ/ జామ/ చిన్న ఆపిల్/ దానిమ్మ
- గింజలు -ఉప్పు తీయని మరియు వేయించనివి ఉత్తమం. రోజువారీ 3-4 వాల్‌నట్‌లు/3-4 పిస్తా/3-4 బాదం/1 లేదా 2 బ్రెజిల్ గింజలు (సులభంగా అర్ధం కావాలంటే, గరిష్టంగా గింజ వినియోగం మన అరచేతుల పరిమాణంతో సమానంగా ఉండాలి)
భోజనం-
8 అంగుళాల ప్లేట్ తీసుకోండి. ఒక సగం పిండి లేని కూరగాయల సలాడ్ తో ఉండాలి. నాలుగవ వంతు ప్రధాన వంటకాన్ని కలిగి ఉండాలి, ఇది సాధారణంగా తృణధాన్యాల ఆధారిత ఆహారం. ప్లేట్‌లో నాలుగవ వంతులో పప్పు వంటి కూరగాయల ప్రోటీన్ లేదా సముద్ర చేపలు లేదా మాంసం లేదా గుడ్డులోని తెల్లసొన వంటి జంతు ప్రోటీన్ ఉండాలి.
ప్రధాన తృణధాన్యాల ఆధారిత వంటకం -2 చిన్న మల్టీగ్రెయిన్ రోటీలు ½ కప్ బ్రౌన్ రైస్ లేదా 1 ½ కప్ బ్రౌన్ రైస్, సైడ్ డిష్‌తో పాటు 1 కప్పు వండిన కూరగాయలు లేదా 1 కప్పు బచ్చలికూర కావచ్చు.
ప్రోటీన్ భాగం ½ కప్ వండిన పప్పు లేదా అర కప్పు టోఫు లేదా సముద్రపు చేప – అరచేతి పరిమాణం లేదా లీన్(కొవ్వు తక్కువగా) మాంసం అరచేతి పరిమాణం లేదా గుడ్డులోని 2 తెల్లసొన.
మధ్యాహ్న భోజన సమయంలో బంగాళదుంపలు,అధిక పిండి పదార్ధాలు లేదా వేయించిన కూరగాయలను తీసుకున్నప్పుడు రోటీలు లేదా అన్నం పరిమాణాన్ని తగ్గించండి. వీలైనప్పుడల్లా వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్‌కు ప్రాధాన్యత ఇవ్వండి. గోధుమ పిండి నుండి రోటీ/చపాతీ తయారు చేసి, చపాతీలో ఫైబర్ కంటెంట్ పెంచడానికి ఓట్ మీల్, ఊక లేదా సోయా పిండిని జోడించండి. ఎక్కువ సంతృప్త కొవ్వులు మరియు కేలరీలను నివారించడానికి వీలైనంత వరకు రోటీలకు నెయ్యి లేదా నూనెను కలపడం మానేయండి.
ఈవినింగ్ స్నాక్ –
1/2 కప్పు తక్కువ కొవ్వు ఉండే పాలు లేదా గ్రీన్ టీ లేదా కాఫీ (రొటీన్ ప్రకారం)
½ కప్పు ఉడికించిన శెనగలు, బ్లాక్ ఐడ్ బఠానీలు లేదా పెసలు.
ఈ సాయంత్రం స్నాక్‌లో ఎక్కువ ప్రొటీన్లు మరియు ఫైబర్‌లు ,తక్కువ కేలరీలు ఉంటాయి, తద్వారా రాత్రి భోజనం కోసం తీసుకునే ఆహారం తగ్గుతుంది.
డిన్నర్ –
3 మిల్లెట్ ఇడ్లీలు లేదా 2 మిల్లెట్ దోసలు గ్రీన్ చట్నీ లేదా రెడ్ చట్నీ (కొబ్బరి లేదా పల్లీల చట్నీని వాడకుండా ఉండేందుకు ప్రయత్నించండి)
లేదా
తక్కువ నూనెతో 2 చపాతీలు లేదా రోటీతో పప్పు లేదా రాజ్మా కూర లేదా శెనగల కూర లేదా మిక్సెడ్ వెజిటబుల్ కూర
లేదా
టొమాటో లేదా అల్లం చట్నీతో 2 పెసరట్లు
పడుకునే సమయానికి ముందు –
చక్కెర లేకుండా 100ml స్కిమ్డ్ మిల్క్ లేదా తక్కువ కొవ్వు పాలు.
పైన చెప్పిన ప్లాన్ ఏమి తీసుకోవాలి మరియు ఎంత పరిమాణంలో తీసుకోవాలి అనే ఒక ఐడియా కోసం మాత్రమే. నిజానికి మీరు దీన్ని మీ ప్రాధాన్యత ఇంకా మీ అలవాట్లకు అనుగుణంగా మార్చుకోవచ్చు. కానీ ఆహారంలో ప్రతి భాగం సరైన నిష్పత్తిలో ఉండాలని గుర్తించుకోండి.
